పాకిస్తాన్ కు ఏషియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ 235 మిలియన్ డాలర్లు సాయం చేసేందుకు అంగీకరించింది. లాహోర్ వాటర్ అండ్ వేస్ట్ వాటర్ మేనేజ్ మెంట్ ప్రాజెక్ట్ కు ఈ సాయం చేయనుంది. లాహోర్ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడంతోపాటు రావి నదిలోకి వ్యర్థాలు ప్రవేశించకుండా ఆ దేశం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్ట్ కు ఏషియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ భారీ సాయం చేసేందుకు ముందుకొచ్చింది. లాహోర్ వాటర్ అండ్ శానిటేషన్ ఏజెన్సీ సంస్థ, చైనాకు చెందిన మరో సంస్థ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ ను చేపట్టాయి. లాహోర్ లో తాగునీటి సరఫరా సమస్యను తీర్చడంతోపాటు మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నారు. అలాగే లాహోర్ లో మురుగునీటి లీకేజీ సమస్యకు చెక్ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో లాహోర్ లో మౌలిక సదుపాయాల కల్పనకు ఏషియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ కు 235 మిలియన్ డాలర్లు సాయం చేసేందుకు అంగీకరించింది. ఈ మేరకు విడతల వారీగా ఈ మొత్తాన్ని పాకిస్తాన్ కు అందించనుంది. అయితే గతంలోనూ వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, ఏఐఐబీ తదితర అంతర్జాతీయ ఫైనాన్సింగ్ సంస్థలు పాకిస్తాన్ కు సాయం చేసిన విషయం తెలిసిందే. అయితే పాకిస్తాన్ మాత్రం ఈ మొత్తాన్ని ఉగ్ర కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నట్లు అనేకసార్లు వెల్లడైంది. ఈ క్రమంలో మరోసారి ఏఐఐబీ భారీ సాయం ప్రకటించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. గతంలోనూ చాలాసార్లు పాకిస్తాన్ కు ఉగ్రస్థావరాల నిర్మాణానికి ఈ సాయాన్ని తరలించింది. మరోసారి పాకిస్తాన్ అదే బాటలో వెళ్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పాకిస్తాన్ కు 235 మిలియన్ డాలర్లు సాయం చేసేందుకు అంగీకరించిన ఏఐఐబీ
October 14, 2025
0
Tags