పాకిస్తాన్‌లో సాయుధ బలగాలు వెళ్లే వాహనంపై మిలిటెంట్లు కాల్పులు : 11 మంది పారామిలిటరీ సిబ్బంది మృతి

Telugu Lo Computer
0


పాకిస్తాన్‌లో సాయుధ బలగాలు వెళ్లే వాహనంపై మిలిటెంట్లు కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు అధికారులతో సహా 11 మంది పారామిలిటరీ సిబ్బంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆప్ఘనిస్తాన్ సరిహద్దుకు సమీపంలో కుర్రం జిల్లాలో పాకిస్తాన్‌ సైన్యం కాన్వయ్‌పై మిలిటెంట్లు ఈ దాడులు చేశారు. దాడికి పాల్పడిన వారి కోసం అక్కడి భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఈ దాడులకు సంబంధించి ఇప్పటిదాకా పాక్‌ ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే తెహ్రీక్ తాలిబన్ పాకిస్తాన్‌ ఈ దాడికి తమదే బాధ్యత అని ప్రకటన చేసినట్లు ప్రచారం నడుస్తోంది. గత కొంతకాలంగా ఆప్ఘనిస్తాన్ - పాకిస్తాన్ సరిహద్దు నుంచి టీటీపీ గ్రూప్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన అనంతరం పాక్‌కు వ్యతిరేకంగా ఆ దేశ భద్రతా సిబ్బంది, ప్రజలే టార్గెట్‌ ఈ గ్రూప్ ఇంతకుముందు కూడా పలుమార్లు దాడులకు పాల్పడింది.

Post a Comment

0Comments

Post a Comment (0)