పాఠశాలలో మద్యం సేవిస్తున్నవిద్యార్థులను మందలించినందుకు మహిళా వంట మనిషిపై దాడి !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లి హైస్కూల్‌లో ఈ నెల 13వ తేదీ రెండో శనివారం కావడంతో పాఠశాల మిద్దెపై కూర్చొని మద్యం సేవిస్తున్న తొమ్మది, పదో తరగతి విద్యార్థులను పాఠశాల మహిళా వంట మనిషి గమనించి ప్రశ్నించింది. వార్డెన్‌కు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దీంతో భయపడిపోయిన విద్యార్థులంతా కలిసి వంట మనిషి కాసిమ్మపై భౌతికంగా దాడి చేసి ముఖ్యంపై దుప్పటి వేసి గొంతు నులిమేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కాసిమ్మను గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)