ఈవెంట్స్‌ ఇండస్ట్రీతో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం సిద్ధం !

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని అక్షయ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్ ఈవెంట్స్‌ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో జరిగిన సౌత్‌ ఇండియా వెడ్డింగ్‌ ప్లానర్స్‌ కాంగ్రెస్‌ సదస్సులో తెలంగాణ రాష్ట్ర పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవెంట్స్‌ ఇండస్ట్రీతో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈవెంట్స్‌ ఇండస్ట్రీ ద్వారా విదేశాలకు వెళ్లకుండానే తెలంగాణను డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌కు అద్భుతమైన కేంద్రంగా మార్చవచ్చని మంత్రి చెప్పారు. రాజస్థాన్‌తో పోలిస్తే తెలంగాణలో గొప్ప చారిత్రక కట్టడాలు, సంస్కృతి, పురాతన ప్యాలెస్‌లు ఉన్నాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో రూ.కోట్లు ఖర్చు చేసే బదులు మన రాష్ట్రంలోనే ఆ వేడుకలు నిర్వహించుకోవడం ద్వారా పర్యాటక రంగానికి ఊతం ఇవ్వొచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. వెడ్డింగ్‌ ప్లానర్స్‌ కాంగ్రెస్‌ సదస్సులో తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్ ఈవెంట్స్‌ అధ్యక్షులు బలరాం బాబు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)