మార్చిలో నేపాల్‌ పార్లమెంట్‌కు ఎన్నికలు

Telugu Lo Computer
0


నేపాల్‌ పార్లమెంట్‌ను అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్‌ రద్దు చేసి, వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు నిర్వహించను  న్నట్లు ప్రకటించారు. రెండు రోజులపాటు తీవ్ర అల్లర్లు చెలరేగిన నేపాల్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఖాట్మాండు వ్యాలీ, ఇతర ప్రాంతాల్లో శనివారం అధికారులు కర్ఫ్యూను ఎత్తివేశారు. నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ తొలి మహిళా ప్రధానమంత్రిగా సుశీలా కర్కి ప్రమాణస్వీకారం చేసిన ఒకరోజు తరువాత దేశంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుత పార్లమెంట్‌ను రద్దు చేయాలనే అధ్యక్షుడి నిర్ణయాన్ని నేపాల్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు, ఇతర ప్రముఖులు ఖండించారు. అధ్యక్షుడి నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం, ఏకపక్షం, ప్రజాస్వామ్యానికి తీవ్రమైన దెబ్బగా విమర్శించాయి. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే ఏ చర్యా ఆమోదయోగ్యం కాదని నేపాల్‌లో అతిపెద్ద రాజకీయ పార్టీ నేపాలీ కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ఆందోళనకరమని సిపిఎన్‌ - యుఎంఎల్‌ ప్రధాన కార్యదర్శి శంకర్‌ పోఖారెల్‌ ఖండించారు. సిపిఎన్‌ (మావోయిస్టు సెంటర్‌) కూడా అధ్యక్షుడి నిర్ణయాన్ని వ్యతిరేకించింది.ఇటీవల జరిగిన నిరసనల కారణంగా అనేక ముఖ్యమైన పత్రాలు ధ్వంసమయ్యాయని సుప్రీంకోర్టు తెలిపింది. వీలైనంత త్వరగా కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తామని పేర్కొంది. నిరసనల్లో కోర్టు భవనాలకు నష్టం జరగడంపై ప్రధాన న్యాయమూర్తి ప్రకాష్‌మాన్‌ సింగ్‌ రౌత్‌ ఒక ప్రకటనలో తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)