ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బార్ లైసెన్సుల గడువును మూడోసారి పొడిగించింది. ఇప్పటికే రెండుసార్లు గడువు ఇచ్చినా ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. కాగా సెప్టెంబర్ 18న లాటరీ విధానం ద్వారా లైసెన్సులు మంజూరు చేయనున్నారు. ప్రభుత్వం మొత్తం 840 బార్ లైసెన్సుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటివరకు కేవలం 412 లైసెన్సులు మాత్రమే ఖరారయ్యాయి. మిగిలిన లైసెన్సులకు తగిన దరఖాస్తులు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
బార్ లైసెన్సుల గడువును మూడోసారి పొడిగించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
September 14, 2025
0
Tags