రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం బొప్పాయి !

Telugu Lo Computer
0


రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం బొప్పాయిని తీసుకోవచ్చు. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా, ఇందులో ఉన్న విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. విటమిన్ C అధికంగా ఉండటం వల్ల శరీర రక్షణ శక్తి పెరుగుతుంది. విటమిన్ A, C, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి ముడతలను తగ్గిస్తాయి. పొటాషియం రక్తపోటును నియంత్రించి గుండెకు మేలు చేస్తుంది. విటమిన్ A కళ్లను రక్షించి చూపును కాపాడుతుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఆర్థరైటిస్ వంటి సమస్యలలో సహాయపడతాయి. బొప్పాయిలోని పెపైన్ ఎంజైమ్ ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం దూరమవుతుంది. తక్కువ కేలరీలతో పాటు ఫైబర్, నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండుగా అనిపించి ఎక్కువసేపు ఆకలి వేయదు. తీపి తినాలనిపించినప్పుడు బొప్పాయి మంచి ప్రత్యామ్నాయం.

Post a Comment

0Comments

Post a Comment (0)