మాజీ డీఎస్సీ నళిని సోషల్ మీడియా వేదికగా సంచలన లేఖ విడుదల చేసారు. నళిని సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టింగ్ లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది. తన అనారోగ్యంపై మరణ వాంగ్మూలం అంటూ ఆమె పోస్ట్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో చోటు చేసుకున్న పరిణామాలను గుర్తు చేసుకున్నారు. సీఎం రేవంత్ తనకు సాయం చేస్తానని చెప్పిన అంశాన్ని గుర్తు చేసారు. పోరాటంలో తనకు నిలువెల్లా గాయాలు అయ్యాయని పేర్కొన్నారు. ఈ లేఖ తన వీలునామా / మరణ వాంగ్మూలంగా పేర్కొనటంతో సంచలనంగా మారింది. తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల తనకు నిలువెల్లా గాయాలే అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నొప్పిని భరిస్తూనే 12 ఏళ్ల అజ్ఞాత వాసంలో ఉన్నానని వాపోయారు. మహర్షి దయానందుని దయవల్ల ఆధ్యాత్మిక మార్గం ఎంచుకుని, అందులోనే వేద యజ్ఞ పరిరక్షణ సమితి స్థాపకురాలుగా ఎదిగానని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తనకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆరు నెలల తర్వాత తన పిటిషన్ పొజిషన్ కనుక్కుంటే చెత్త బుట్ట పాలైందని తెలిసిందని అన్నారు. తన ఆఫీస్ కాపీని మళ్లీ స్కాన్ చేసి పంపానని తెలిపారు. ఆ విషయంపై ఇప్పటి వరకు స్పందన లేదని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో నళిని ఓ విజ్ఞప్తి చేశారు. తాను చనిపోయిన తర్వాత ఎవరూ కూడా సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయవద్దని, రిజైన్డ్ ఆఫీసర్, కవయిత్రి, యజ్ఞ బ్రహ్మ అని తనను సంభోదించాలని అంటూ పోస్ట్ చేశారు. దీంతో, అసలు నళని ఆరోగ్య పరిస్థితి ఏంటనేది చర్చగా మారింది. నళిని ఎలాంటి ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారనే అంశం పైన ఆరా తీస్తున్నారు. నళిని తన లేఖలో తన ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్‌గా ఉందని, ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్‌లో ఉన్నానని చెప్పుకొచ్చారు. మూడు రోజుల నుండి నిద్ర లేదని, రాత్రంతా మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నానని వివరించారు. 25 ఏండ్ల క్రితమే తన శరీరం నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్‌కు సెన్సిటివ్‌గా మారిపోయిందని వివరించారు. తాను చనిపోయాక అంటే పోస్టుమస్ అవార్డులు, రివార్డులు ఇవ్వడానికి బయలుదేరే రాష్ట్ర నాయకులకు ఒక వినతి అంటూ బ్రతికుండగా తనను పట్టించుకొని రాజకీయ లబ్ధి కోసం న పేరును వాడుకోవద్దని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ పోస్టింగ్ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాజీ డీఎస్పీ నళిని లేఖ !
September 21, 2025
0
Tags