మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే X ఖాతా హ్యాక్ !

Telugu Lo Computer
0


హారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే X ఖాతా హ్యాక్ అయ్యింది. ఆ క్రమంలో హ్యాకర్లు ఈ ఖాతా నుంచి పాకిస్తాన్, టర్కీ జెండాలతో కూడిన చిత్రాలను పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లు చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇవి చూసిన మరికొంత మంది ఒక్కసారిగా చర్చించడం మొదలుపెట్టారు. డిప్యూటీ సీఎం ఖాతా హ్యాక్ కావడం, అది కూడా ఇతర దేశాల జెండాలను పోస్ట్‌ చేయడం అనేక మందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ పోస్ట్‌లు కొద్ది సేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ హ్యాకింగ్ సమాచారం అందుకున్న కొద్ది సేపటికే, షిండే టెక్నికల్ బృందం వెంటనే రంగంలోకి దిగింది. అనధికారికంగా పోస్ట్ చేసిన అన్ని పోస్ట్‌లను తొలగించింది. షిండే ఖాతాను సురక్షితంగా తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఆ ఖాతా మళ్లీ సాధారణ స్థితిలో కొనసాగుతోంది. టెక్నికల్ బృందం ఈ ఘటనపై దృష్టి సారించి, మరిన్ని భద్రతా చర్యలు తీసుకుంటోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)