జీఎస్టీ తగ్గింపుతో భారీగా తగ్గనున్న టీవీ ధరలు

Telugu Lo Computer
0


రేపటి నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను బదిలీ చేసేందుకు టెలివిజన్‌ తయారీదారులు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించారు. టీవీల మీద రూ.2,500 నుంచి రూ.85,000 వరకు తగ్గింపు ప్రకటించారు. దీంతో వినియోగదారులకు పండగ సీజన్‌ ఆఫర్లతో పాటు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనమూ కలిసి రానుంది. 32 అంగుళాల పైబడిన టీవీలపై జీఎస్టీ రేటు 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. దీంతో తయారీదారులు స్కీన్‌ సైజులు, స్పెసిఫికేషన్ల ఆధారంగా ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. సోనీ, ఎల్‌జీ, పానాసోనిక్‌ వంటి అగ్ర టీవీ బ్రాండ్లు సెప్టెంబర్‌ 22 నుంచి అమల్లోకి వచ్చే కొత్త ధరల జాబితాను విడుదల చేశాయి. టీవీలతో పాటు సౌండ్‌ బార్లు, పార్టీ స్పీకర్ల అమ్మకాలు కూడా గణనీయంగా పెరుగుతాయని అంచనా. సోనీ ఇండియా 43 నుంచి 98 అంగుళాల వరకు ఉన్న బ్రావియా టీవీ మోడళ్లపై రూ.5వేల నుంచి రూ.71 వేల వరకు ధరలు తగ్గించనుంది. 43 అంగుళాల బ్రావియా 2 రూ.59,900 నుంచి రూ.54,900కి తగ్గనుంది. 55 అంగుళాల టీవీ 7 ధర రూ.2.80 లక్షల నుంచి రూ.2.50 లక్షలకు తగ్గింది. 98 అంగుళాల టాప్‌ ఎండ్‌ బ్రావియా 5 రూ.9 లక్షల నుంచి రూ.8.29 లక్షలకు దిగి రానుంది. ఎల్‌జీ 43 అంగుళాల నుంచి 100 అంగుళాల వరకు ఉన్న మోడళ్లపై రూ.2,500 నుంచి రూ.85,800 వరకు ధరలు తగ్గిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. 43 అంగుళాల మోడల్‌ రూ.30,990 నుంచి రూ.28,490 వరకు తగ్గనుంది. 65 అంగుళాల టీవీ ధర రూ.71,890 నుంచి రూ.68,490 తగ్గనుంది. 100 అంగుళాల టీవీపై రూ.5,85,590 నుంచి రూ.4,99,790కి తగ్గించారు. పానాసోనిక్‌ 43 అంగుళాల మోడళ్లపై రూ.3,000 నుంచి రూ.4,700 తగ్గిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కొత్త ధరలను రూ.33,990, రూ.45,990, రూ.54,290గా సవరించింది. గతంలో వీటి ధరలు రూ.36,990, రూ.49,990, రూ.58,990గా ఉండేవి. 55 అంగుళాల మోడళ్ల రూ.7 వేలు తగ్గించి.. కొత్త ధరలు రూ.65,990-76,990గా నిర్ణయించింది. 65 అంగుళాల టాప్‌ మోడళ్ల రూ.3.20 లక్షల నుంచి రూ.2.94 లక్షలకు తగ్గించారు. 75 అంగుళాల టీవీ ధర రూ.4 లక్షల నుంచి రూ.3.68 లక్షలకు వస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)