తెలంగాణలోని మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శభాష్ పల్లి కి చెందిన బొట్టు మమతకు, భాస్కర్ దంపతులకు ఒక కొడుకు, కూతురు. మమతకు తన తల్లిగారి గ్రామమైన శభాష్ పల్లి గ్రామానికి చెందిన షేక్ ఫయాజ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. మే నెల నుంచి మమత ఆమెతోపాటు కుమార్తె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు మమత గుంటూరులో ఉందని గుర్తించి మమతను, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. రెండేళ్ల కుమార్తె గురించి మమతను విచారణ చేసిన పోలీసులకు షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని, గుంటూరు జిల్లా నరసరావుపేట నుండి శభాష్ పల్లికి వచ్చి శభాష్ పల్లి శివారులోనే పాపని చంపి పాతి పెట్టి, మళ్ళీ తిరిగి నరసరావుపేటకు వెళ్ళిపోనట్లు మమత, ఆమె ప్రియుడు ఇద్దరు పోలీసులు ముందు ఒప్పుకున్నారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి శవాన్ని బయటకు తీశారు. తహసిల్దార్ తో పాటు డాక్టర్ల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. అయితే గతంలో కూడా మమత ప్రియుడితో పారిపోవడంతో ఆమె ప్రవర్తన పైన భర్త అభ్యంతరం వ్యక్తం చేసి ఆమెతో కలిసి జీవించడానికి నిరాకరించాడు. భర్త నిరాకరించిన మమత తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఈ క్రమంలో ఐదేళ్ల కొడుకును తల్లిదండ్రుల దగ్గర వదిలేసి, మళ్లీ ప్రియుడితో పారిపోయింది. రెండేళ్ల కుమార్తె అడ్డుగా ఉందని అత్యంత కర్కశంగా చంపి ప్రియుడితో పరార్ అయింది ఈ కర్కశ తల్లి. వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు నేడు వీరిని కోర్టులో హాజరు పరిచారు.
ప్రియుడి కోసం రెండేళ్ల బిడ్డను కడతేర్చిన కసాయి తల్లి !
September 13, 2025
0
Tags