అభివృద్ధి జరిగితే సంపద సృష్టితో ప్రభుత్వానికి ఆదాయం : అసెంబ్లీలో జీఎస్టీ సంస్కరణలపై చంద్రబాబు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జీఎస్టీ సంస్కరణలపై  ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ జీఎస్టీ రెండోతరం సంస్కరణలు తీసుకొచ్చారు. సంస్కరణలకు నేను ఎప్పుడూ ముందుంటాను. అభివృద్ధి జరిగితే సంపద సృష్టితో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం వస్తేనే సంక్షేమం, అభివృద్ధి జరుగుతుంది. సంపద సృష్టించని వారికి సంక్షేమం ఇచ్చే అధికారం లేదు. అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం సరికాదనేది నా నమ్మకం. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా దేశం, రాష్ట్రమే ముఖ్యం. దీర్ఘకాల సంస్కరణలను దృష్టిలో పెట్టుకుని చూడాలి. గతంలో 4 టైర్‌ పన్నుల వ్యవస్థ ఉండేది. ఒకే ఉత్పత్తికి సంబంధించి అనుబంధ ఉత్పత్తులు వస్తే పన్నులు మార్చేవారు. పన్నుల విధానంలో రెండు శ్లాబులు ఉంచి సరళతరం చేశారు. ఈసారి అన్ని పండుగలు ఘనంగా జరుపుకొనే అవకాశం ఉంది. ప్రధాని మోడీ  సంస్కరణలతో పరోక్ష పన్ను చెల్లింపుదారులు 132శాతం పెరిగారు. 2017లో 65లక్షల మంది ఉంటే, ప్రస్తుతం 1.51 కోట్ల మంది ఉన్నారు. జీఎస్టీ రిసిప్ట్‌ల ద్వారా 2018లో రూ.7.19లక్షల కోట్ల ఆదాయం వస్తే, ప్రస్తుతం 22.08లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. జీఎస్టీ సంస్కరణలు పేదల జీవితాలపై ప్రభావం చూపుతాయి. 'వన్‌ నేషన్‌- వన్‌ విజన్‌' నినాదంతో ముందుకెళ్లాలి. డబుల్‌ ఇంజిన్‌ గ్రోత్‌ సాధించే దేశంగా భారత్‌ ఎదుగుతుంది. కొత్త పన్నులతో వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థకు రూ.2లక్షల కోట్లు సమకూరుతుందని సీఎం వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)