తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భద్రతా ఏర్పాట్లు పూర్తి !

Telugu Lo Computer
0


తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. గత బ్రహ్మోత్సవాల్లో లోపాలను గుర్తించి ప్రత్యేకమైన భద్రతా చర్యలు చేప్టటామని చెప్పారు. భద్రత కోసం తిరుమలలో 3 వేల మంది, తిరుపతిలో వెయ్యి మంది పోలీసులను వినియోగిస్తున్నామన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేశామన్నారు. స్వామివారి దర్శనం కోసం వేచి ఉండే భక్తులకు నిరంతరం అన్నప్రసాదాలు, తాగు నీరు వంటివి పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గరుడ సేవ రోజు తిరుమల కనుమ రహదారుల్లో ద్విచక్రవాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించామని, తిరుమల వచ్చే భక్తులు ఆర్టీసీ బస్సుల ద్వారా రావాలని కోరారు. తిరుపతిలో ఐదు ప్రాంతాలలో పార్కింగ్‍ స్థలాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నాలుగు వేల సీసీ కెమెరాల ద్వారా బ్రహ్మోత్సవాలను పర్యవేక్షిస్తామన్నారు. 1500 మంది విజిలెన్స్ సిబ్బంది బ్రహ్మోత్సవాల విధుల్లో పాల్గొననున్నట్లు తితిదే ముఖ్య భద్రతా అధికారి మురళీకృష్ణ తెలిపారు. విజిలెన్స్‌తో పాటు అనుబంధ విభాగాలైన ఆక్టోపస్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు నిరంతరం భక్తుల భద్రతను పర్యవేక్షిస్తాయన్నారు. నిఘా వ్యవస్థలో ఎలాంటి లోపం లేకుండా పని చేస్తామన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)