హైదరాబాద్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థిపై దాడి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలపై నాచారం సీఐపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. పుట్టిన రోజున బర్త్‌డే బంప్స్ పేరిట తోటి విద్యార్థులు చేసిన వికృత చేష్టలతో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. కొత్తపేటకు చెందిన విద్యార్థి నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. ఆగస్టు 29న పుట్టినరోజు కావడంతో తోటి విద్యార్థులు మధ్యాహ్నం విరామ సమయంలో సరదాగా చేసిన చేష్టలతో ఆ విద్యార్థి మర్మంగానికి గాయమై రక్తస్రావమైంది. పిడిగుద్దుల ధాటికి రక్తం కారుతున్నా తోటి విద్యార్థులు వదల్లేదు. విషయం తెలిసి ప్రిన్సిపల్ ఆ విద్యార్థిని ఆసుపత్రికి తరలించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు మెరుగైన వైద్యం కోసం బంజారాహిల్స్‌లోని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థికి శస్త్ర చికిత్స చేయడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినప్పటికీ బాధ్యులైన విద్యార్థులు, పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని నాచారం సీఐని బదిలీ చేస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.
ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఘటనలో నాచారం సీఐపై బదిలీ వేటు !
September 18, 2025
0
Tags