ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో గురువారం భారీ వర్షం కారణంగా వరదలు సంభవించాయి. దీనితో కొండచరియలు విరిగిపడి నాలుగు గ్రామాల్లో 30కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. 20 మంది గాయపడగా 14 మంది గల్లంతయ్యారు. శిథిలాల కింద వారు చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నాయని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, తలకు గాయమైన చిన్నారితో సహా తీవ్రంగా గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు తరలించినట్లు వివరించారు. ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు.
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలకు విరిగిపడిన కొండచరియలు : 30కు పైగా ఇళ్లు ధ్వంసం
September 18, 2025
0
Tags