చైనాలో ఎయిర్ షో కోసం రిహార్సల్ చేస్తున్న సమయంలో రెండు ఎగిరే కార్లు గాలిలో ఒకదానికొకటి ఢీకొన్నాయి. చాంగ్‌చున్ ఎయిర్ షో 2025 సెప్టెంబర్ 19న నిర్వహించనున్నారు. ప్రదర్శనలో ప్రదర్శించాల్సిన రెండు ఎగిరే కార్లు రిహార్సల్ చేస్తున్నప్పుడు గాలిలో ఢీకొన్నాయి. రెండు కార్లు చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీదారు ఎక్స్ పెంగ్.ఐఎన్ సి కి చెందినవిగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. మంగళవారం రిహార్సల్స్ చేస్తున్న సమయంలో రెండు ఎలక్ట్రిక్ ఎగిరే కార్లు ఒకటి టేకాఫ్, మరొకటి ల్యాండింగ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. నేలపై ఢీకొన్న తర్వాత ఒక వాహనం మంటల్లో చిక్కుకుంది. రెండు ఎగిరే కార్లు గాలిలో ఢీకొని క్రాష్ అయ్యాయి, చాంగ్‌చున్ ఎయిర్‌షోలో మంటలు చెలరేగాయి! సెప్టెంబర్ 16న, చాంగ్‌చున్ ఎయిర్‌షో రిహార్సల్ ముగిసిన తర్వాత, గ్వాంగ్‌డాంగ్ హుటియన్ జనరల్ ఏవియేషన్. రెండు eVTOLలు గాలిలో ఢీకొని ఆపై క్రాష్ అయ్యాయి, నేలపై పెద్ద మంటలు చెలరేగాయి. అని సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చారు.
రిహార్సల్ చేస్తున్న రెండు ఎగిరే కార్లు గాలిలో ఢీ : ఎయిర్‌షో యాక్సిడెంట్ వీడియో వైరల్
September 18, 2025
0
Tags