ఇండోర్‌లో దేవీ నవరాత్రి ఉత్సవాల కోసం భారీ మండపం ఏర్పాటు

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దేవీ నవరాత్రి ఉత్సవాల కోసం భారీ మండపాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని వీఐపీ పరస్పర్‌ నగర్‌ కాంప్లెక్స్‌లో దాదాపు రూ.300 కోట్ల అంచనాతో రూపుదిద్దుకున్న ఈ మండపం దేశంలోనే అతిపెద్ద, అత్యంత ఖరీదైనదిగా నిలుస్తోంది. దాదాపు 30 ఎకరాల్లో చేపట్టిన ఈ భారీ మండపంలో 12 జ్యోతిర్లింగాలతోపాటు దేశంలో ప్రముఖ ఆలయాల నమూనాలను ఏర్పాటు చేశారు. దక్షిణ భారత దేవాలయాల నిర్మాణ శైలిలో వివిధ ఆలయాలు నెలకొల్పారు. ఆంధ్రప్రదేశ్‌ సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 500 మందికిపైగా కళాకారులు మూడు నెలలుగా ఇందుకోసం కష్టపడ్డారు. వీటి నిర్మాణం కోసం రూ.300 కోట్లు ఖర్చు అవుతున్నట్లు అంచనా. కృష్ణగిరి పీఠాధిపతి వసంత్‌ విజయానంద్‌ గిరి మహారాజ్‌ భక్తుల విరాళాలతో ఈ భారీ మండప నిర్మాణాన్ని చేపట్టారు. ఇక్కడ 25వేల చ.అ.విస్తీర్ణంలో యాగశాల నిర్మించారు. 108 మంది పండితులు యజ్ఞయాగాలను నిర్వహించనున్నారు. లక్షలాదిగా భక్తులు తరలి రానున్న నేపథ్యంలో వారికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్‌ 22 నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయనున్నారు. ఇక్కడికి వచ్చే భక్తుల కోసం బంగారు కలశాలను అమ్మకానికి ఉంచారు.

Post a Comment

0Comments

Post a Comment (0)