కర్ణాటకలోని మైసూరులో దసరా ఏనుగులతో ఓ యువతి రీల్స్ చేసింది. వాటిని సోషల్ మీడియాలో పెట్టగా వైరల్ అయ్యాయి. మావటీలు, కాపలాదారులు తప్ప ఇతరులు దసరా ఏనుగుల వద్దకు వెళ్లే అవకాశం లేదు. కానీ ఓ యువతి రాత్రి సమయంలో వచ్చి ఏనుగుల వద్ద డ్యాన్సులు చేస్తూ సెల్ఫీలు, వీడియోలు తీసుకుంది. ఆ సమయంలో అక్కడి సిబ్బంది ఎందుకు ఆమెను అడ్డుకోలేదో తెలియడం లేదు. వీడియోలు వ్యాప్తి చెందగా, ఆమె చర్యపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. అటవీశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ యువతి కోసం గాలిస్తున్నారు.
దసరా ఏనుగులతో రీల్స్ చేసిన యువతి
September 21, 2025
0
Tags