మేఘాలయ మాజీ సీఎం డీడీ లాపాంగ్ (91) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన షిల్లాంగ్లోని బెథానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. లాపాంగ్ 1992 - 2010 మధ్య నాలుగుసార్లు సీఎంగా పని చేశారు. 1972లో రాజకీయాల్లోకి ప్రవేశించి తొలుత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆపై కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేఘాలయ రాజకీయాల్లో అత్యంత ప్రతి భావవంతమైన వ్యక్తులలో లాపాంగ్ ఒకరిగా నిలిచారు.
మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి లాపాంగ్ కన్నుమూత
September 13, 2025
0
Tags