బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని సూచిస్తుంది. రేపు మరికొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది హెచ్చరిస్తున్నారు. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, జగిత్యాల, జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. ఈ జిల్లాలకు ఆరెంజ్ ఆలర్ట్ జారీ చేసింది. వర్షాల ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, ములుగు, నాగర్ కర్నూల్ సహా మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలతో పాటు.. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు.. కాకినాడ, అంబ్కేదర్ కోనసీమ, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ తెలిపింది.
అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు
September 13, 2025
0
Tags