కుషాయిగూడలో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య

Telugu Lo Computer
0


తెలంగాణలోని మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీకాంత్ రెడ్డిని కొందరు గుర్తుతెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. వేట కొడవళ్లతో శ్రీకాంత్ రెడ్డి ఇంటి బయటే నరికి చంపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న కుషాయిగూడ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి  వచ్చారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే కాలనీ వాసులంతా చూస్తుండగానే శ్రీకాంత్ రెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కొందరు అడ్డుపడగా వారిని కత్తులతో బెదిరింపులకు గురిచేశారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)