మధ్యప్రదేశ్‌లో స్వస్థ్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని స్వస్థ్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తల్లులు, సోదరిమణులకు అంకితం చేసినట్లు ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంట్లో తల్లి బాగుంటే ఇళ్లన్నీ బాగుంటాయని పేర్కొన్నారు. నిజాం అకృత్యాల నుంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగిందన్నారు. అందులో భాగంగా హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఘనం నిర్వహిస్తున్నామని చెప్పారు. మహిళలు, యువత, పేదలు, రైతులు వికసిత్ భారత్‌కు నాలుగు స్తంభాలని ప్రధాని మోడీ అభివర్ణించారు. 140 కోట్ల మంది భారతీయులతో వికసిత్ భారత్ కోసం సంకల్పం చేశామన్నారు. అణు బెదిరింపులకు భారత్ భయపడదని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌తో ఉగ్రవాదులకు బుద్ధి చెప్పామన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ హీరోలపై ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. దేశ ఐక్యత కోసం మన సైనికులు అనేక త్యాగాలు చేశారని గుర్తు చేసుకున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)