జపాన్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు పీఎం షిగేరు ఇషిబా అధికారికంగా ప్రకటించారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీలో ఏడాదిగా విభేదాలు నెలకొన్నాయి. దీంతో అంతర్గత విభేదాలకు స్వస్తి పలకాలన్న ఉద్దేశంతో రాజీనామా చేయనున్నట్లు ఇషిబా స్పష్టం చేశారు. త్వరలోనే కొత్త ప్రధాని పదవి ఎన్నిక ప్రక్రియ చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది జులైలో ఎగువసభలో ఎల్‌డీపీ కూటమి మెజార్టీ కోల్పోయింది. ఎన్నికల్లో ఓటిమికి బాధ్యత వహించాలని ఆ పార్టీపై ఒత్తిడి పెరిగింది. ఒత్తిడి దృష్ట్యా ఇషిబా ప్రధాని పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇషిబా ప్రధాని పదవి నుంచి వైదొలుగుతుండడం వెనుక పార్టీలోని ఒత్తిడే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఆయన రాజీనామా కీలకమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. జపాన్‌ను నడిపించే తదుపరి నాయకుడు ఎవరన్నది ఆసక్తిగా మారింది.
జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా రాజీనామా
September 07, 2025
0
Tags