అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వరంగంలో భారీగా ఉద్యోగుల తగ్గింపునకు శ్రీకారం చుట్టారు . ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉద్యోగాల నుంచి తప్పుకొనే ఉద్యోగులకు ట్రంప్ సర్కారు స్వచ్ఛంద రాజీనామాల కార్యక్రమాన్ని అమలు చేస్తోంది దీనికి మంగళవారం తుది గడువు కావడంతో అంగీకరించిన వారందరూ ఆరోజున రాజీనామాచేస్తారనిభావిస్తున్నారు. ఒకవేళ ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామాలు చేయకపోతే పెద్ద ఎత్తున తొలగింపు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఫెడరల్ ఏజెన్సీలను వైట్ హౌస్ఆదేశించింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రభుత్వరంగంలోఅత్యంత భారీ సంఖ్యలో నిష్క్రమణలు ఇవేకావడం గమనార్హం. కాగా చెప్పినట్లు రాజీనామా చేసిన ఉద్యోగులకు ఎనిమిది నెలల పాటు అడ్మినిస్ట్రేటివ్ లీవ్ ఇచ్చి ఆ ఎనిమిది నెలల కాలానికి వేతనాలు, ఇతర ప్రయోజాలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వానికి 14.8 బిలియన్ డాలర్లు ఖర్చుకానుంది. అయితే ఉద్యోగుల తగ్గింపుతో దీర్ఘకాలికంగా ఏటా 28 బిలియన్ డాలర్లు ప్రభుత్వానికి ఆదా అవుతాయని అధికారులు చెబుతున్నారు.
లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులకు మంగళం పాడనున్న అమెరికా
September 29, 2025
0
Tags