ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్స్ ఫ్యాక్టరీ నిర్మించవద్దని 16 రోజులుగా మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో హోంమంత్రి అనిత కాన్వాయ్‌ను మత్స్యకారులు అడ్డుకుని కారు ముందు నిరసన తెలిపారు. మత్స్యకారుల సమస్యలు తెలుసుకునేందుకు రాజయ్యపేటలో మంత్రి అనిత, స్థానిక ఆర్డీవో, అధికారులు పర్యటించారు. వారితో మాట్లాడిన అనంతరం 10 మంది కలిసి ఓ కమిటీగా ఏర్పడాలని వారిని సీఎం, డిప్యూటీ సీఎం వద్దకు తీసుకెళ్తానని అనిత చెప్పి అక్కడి నుంచి బయల్దేరారు. అయితే తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ అనిత కారును అడ్డుకుని బైఠాయించారు. నిరసనకారులను చెదరగెట్టేందుకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి.
హోంమంత్రి అనిత కాన్వాయ్‌ను మత్స్యకారులు అడ్డుకుని కారు ముందు నిరసన తెలిపిన మత్స్యకారులు
September 29, 2025
0
Tags