వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని, రాగాల 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మత్స్యకారులు శుక్రవారం సముద్రంలో వేటకు వెళ్లరాదని, భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం
September 02, 2025
0
Tags