మిచెల్ స్టార్క్ టీ20లకు గుడ్ బై !

Telugu Lo Computer
0


స్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్  టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టులు, వన్డేలపై ఫోకస్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మిచెల్ స్టార్క్ వెల్లడించాడు. స్టార్క్ తన ప్రకటనలో టెస్ట్ క్రికెట్ కు తన కెరీర్ లో ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. రాబోయే భారత్ పర్యటన, యాషెస్ సిరీస్, 2027 వన్డే ప్రపంచ కప్ లకు సిద్ధం కావడానికి ఇది ఉత్తమ మార్గమని అభిప్రాయపడ్డాడు. స్టార్క్ తన ప్రకటనలో టెస్ట్ క్రికెట్ కు తన కెరీర్ లో ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. కాగా 35 ఏళ్ల మిచెల్ స్టార్క్ 23.81 సగటుతో 79 వికెట్లు తీశాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియా తరపున అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ గా స్టార్క్ నిలిచారు. 2021లో ఆస్ట్రేలియా పురుషుల టీ20 ప్రపంచ కప్ గెలవడంలో మిచెల్ స్టార్క్ కీ రోల్ పోషించాడు. స్టార్క్ రిటైర్మెంట్ తో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇప్పుడు కొత్త ఫాస్ట్ బౌలింగ్ అటాక్ ను రూపొందించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పవచ్చు. స్టార్క్ తన క్రికెట్ కెరీర్ ను వికెట్ కీపర్ గా ప్రారంభించారు. అయితే, కోచ్ సలహా మేరకు అతను ఫాస్ట్ బౌలింగ్ పై దృష్టి పెట్టడం మొదలుపెట్టాడు. ఈ మార్పు అతని కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన బౌలర్లలో స్టార్క్ ఒకరు. 2015లో అతను న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 160.4 కి.మీ/గం వేగంతో బంతిని విసిరి రికార్డు సృష్టించారు. స్టార్క్ భార్య అలీసా హీలీ కూడా ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ గా వ్యవహరించారు. క్రికెట్ ప్రపంచంలో ఒకే దేశం తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన మూడో జంట వీరు.

Post a Comment

0Comments

Post a Comment (0)