వాణిజ్యం, ఇంధన సంబంధిత అంశాల్లో భారత్‌ చర్యల్లో తాము జోక్యం చేసుకోము : రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌

Telugu Lo Computer
0


క్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాలకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ హాజరై, అనంతరం భారత విలేకరులతో మాట్లాడుతూ డిసెంబరులో పుతిన్‌ భారత్‌లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఇరు దేశాల మధ్య విస్తృతమైన ద్వైపాక్షిక అజెండా ఉందన్నారు. వాణిజ్యం, సైనిక, సాంకేతికత, కృత్రిమ మేధ వంటి కీలక విషయాల్లో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య జరిగే సాధారణ దౌత్య చర్చల్లో భాగంగా ఈ ఏడాదిలో విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ మాస్కోలో పర్యటించే అవకాశం ఉందని, తాను కూడా భారత్‌లో పర్యటిస్తానని తెలిపారు. వాణిజ్యం, ఇంధన సంబంధిత అంశాల్లో భారత్‌ చర్యల్లో తాము జోక్యం చేసుకోమని లవ్రోవ్‌ స్పష్టం చేశారు. వీటిపై స్వయంగా నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యం ఆ దేశానికి ఉందన్నారు. చమురు వాణిజ్య విధానాలపై భారత వైఖరిని ఆయ కొనియాడారు. ఈ సందర్భంగా చమురు కొనుగోళ్లపై ఇంతకుముందు జైశంకర్‌ పేర్కొన్న విషయాలను లవ్రోవ్‌ మరోసారి ప్రస్తావించారు. అమెరికా తన చమురును అమ్మాలనుకుంటే దానికి సంబంధించిన నిబంధనలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని జైశంకర్‌ పేర్కొన్నట్లు తెలిపారు. కానీ, యూఎస్‌తో కాకుండా రష్యా లేదా ఇతర దేశాలతో వాణిజ్యం కొనసాగించడం అనేది తమ సొంత విషయమని ఆయన తెలిపినట్లు వెల్లడించారు. దీనిని ఉదహరిస్తూ భారత్‌కు ఆత్మగౌరవం ఉందని లవ్రోవ్‌ వ్యాఖ్యానించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)