జీలకర్ర నీరు - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


జీలకర్ర కేవలం ఆహారానికి రుచి మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలకు ఔషధం లాంటిదని చెబుతున్నారు. జీలకర్ర నీరు తాగడం వల్ల అజీర్తి, గ్యాస్, ఉబ్బరం, బరువు పెరగడం వంటి సమస్యలు తగ్గుతాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇది గ్యాస్ సమస్యలకు తక్షణ ఉపశమనం ఇస్తుంది. జీవక్రియ వేగవంతమవడంతో కొవ్వు కరిగి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. శరీరంలో పోషకాలను సమతుల్యం చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రాత్రి పడుకునే ముందు తాగితే మంచి నిద్ర వస్తుంది. వేడి చేసిన జీలకర్ర నీరు తాగితే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. భోజనం తర్వాత ఒక గ్లాసు జీలకర్ర నీరు తాగితే అజీర్తి తగ్గుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది. రాత్రి నిద్రలేమితో బాధపడేవారు పడుకునే ముందు తాగితే ఉపశమనం పొందవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)