రెనో కార్లపై రూ.96వేల వరకు తగ్గింపు !

Telugu Lo Computer
0


రెనో ఇండియా కార్లపై గరిష్ఠంగా రూ.96,395 వరకు తగ్గింపు ప్రకటించింది. ఎంట్రీ లెవల్‌ క్విడ్‌పై రూ.55,095, ట్రైబర్‌పై రూ.80,195, కైగర్‌పై రూ.96,395 వరకు ధర తగ్గనుంది. సెప్టెంబరు 22 నుంచి చేసే అన్ని డెలివరీలపై ఈ తగ్గింపు వర్తిస్తుందని ఆటోమొబైల్‌ సంస్థ వెల్లడించింది. అయితే, ఈ కొత్త ధరలతో (GST on Cars) కస్టమర్లు ఇప్పటి నుంచే కార్ల బుకింగ్‌ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. ''జీఎస్టీ 2.0 ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం. ఈ నిర్ణయంతో పండగ సీజన్‌లో మా కార్లకు గిరాకీ కూడా పెరుగుతుందని విశ్వసిస్తున్నాం'' అని రెనో ఇండియా ఎండీ వెంకట్రాం మామిళ్లపల్లి వెల్లడించారు. జీఎస్టీ సవరణలో భాగంగా 1500 సీసీలోపు ఉన్న డీజిల్‌, డీజిల్‌ హైబ్రిడ్‌ కార్లు, 1200 సీసీలోపు పెట్రోల్‌, పెట్రోల్‌ హైబ్రిడ్‌, సీఎన్‌జీ, ఎల్‌పీజీ కార్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. ఇక, 350 సీసీలోపు మోటార్‌సైకిళ్లపైనా 18 శాతం జీఎస్టీ పడనుంది. 1200 సీసీకి మించిన కార్లు, 350 సీసీకి మించిన సామర్థ్యంతో ఇంజిన్‌ ఉండే బైకులు ప్రీమియం శ్రేణి కిందికి వస్తాయి. వీటిపై జీఎస్టీని 28 శాతం నుంచి 40 శాతానికి పెంచారు.

Post a Comment

0Comments

Post a Comment (0)