ఇన్‌స్టాగ్రామ్‌లో @storyteller_emma అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఎమ్మా అనే యువతి Instagrammer లో ప్రజల బాధలను వినడానికి డబ్బులు తీసుకుని వ్యాపారాన్ని ప్రకటించింది. ఆమె వీడియోలో చెప్పిన వివరాల ప్రకారం చిన్న చిన్న ఫిర్యాదులు చెబితే రూ.200, పెద్ద సమస్యలకు రూ.400, మరింత భావోద్వేగపూరితంగా, కన్నీళ్లతో కూడిన సెషన్ అయితే రూ.1000. ఇలా రేట్లు ఫిక్స్ చేసింది. నీ బాధల్లో నేను నీతోనే ఉన్నాను. ఏ బాధ అయినా చెప్పు, నేను వింటాను. నువ్వు ఒంటరివి కాదు. కానీ డబ్బు సిద్ధంగా ఉంచుకో అని ఎమ్మా ఆ వీడియోలో చెబుతోంది. ఈ వీడియోను ఆమె హాస్యం, ఫన్నీ కంటెంట్, కామెడీ వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో పోస్ట్ చేసింది.అయితే ఇది కేవలం వినోదం కోసం చేసిన ప్రయత్నమని స్పష్టంగా ఉంది. అయినప్పటికీ, ఈ ఆలోచన చాలా మందికి ఆసక్తికరంగా అనిపించి అది క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. ప్రస్తుతం ఆ క్లిప్‌కు 21 లక్షల వ్యూస్, 26 వేల లైక్స్, 91 వేల షేర్లు, అలాగే 5 వేలకు పైగా వ్యాఖ్యలు వచ్చాయి. సోషల్ మీడియాలో వినియోగదారులు ఈ వీడియోపై ఫన్నీగా స్పందిస్తున్నారు. ఒక వినియోగదారు హిమానీ రాజ్‌పుత్ కామెంట్ చేస్తూ నేను చాలా కాలంగా ఇదే పని చేస్తున్నాను, అది కూడా ఉచితంగా అని సరదాగా రాశారు. మరొకరు ఈ వీడియో చూసాక నా బాధలు పోయాయి. మళ్ళీ మళ్ళీ చూస్తే నవ్వు వస్తోందని ప్రశంసించారు.మరొక యూజర్ ప్రీతి రాథోడ్..నెలవారీ సబ్‌స్క్రిప్షన్ మోడల్ చేస్తే ఇంకా బావుంటుందని సూచించారు. అనుష్క అనే వ్యాఖ్యాత నేను ఈ బిజినెస్ నడిపితే కోటీశ్వరురాలిని అవుతానని సరదాగా రాశారు.మరొక నెటిజన్ QR కోడ్ పంపు సోదరి, నా చిన్న బాధకు రూ.200 పంపాలని ఎమ్మాను అభ్యర్థించారు. ఈ మొత్తం వ్యవహారం హాస్యప్రధానంగానే ఉన్నప్పటికీ ఆధునిక జీవనశైలిలో, ఒంటరితనం, మానసిక ఒత్తిడి పెరుగుతున్నాయి. మనసులోని బాధలను ఎవరో ఒకరితో పంచుకోవాలని అనుకునే వాళ్లకు ఇలాంటి లిసనింగ్ సర్వీసులు ఆకర్షణీయంగా కనిపించేలా ఉన్నాయి. ముందు ముందు ఇవన్నీ మంచి వ్యాపారంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పెట్టుబడి లేని వ్యాపారం : ఏడిస్తే రూ.1000, సమస్య వింటే రూ. 400, చిన్న ఫిర్యాదులు చెబితే రూ.200 !
September 06, 2025
0
Tags