తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ గాయత్రి నగర్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న విశ్రాంత ఉద్యోగి ప్రసాద్‌బాబు (65) క్రేన్ ఢీకొని మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం. డ్రైవర్ నిర్లక్ష్యంగా క్రేన్ నడపడంతో నడుచుకుంటూ వెళ్తున్న ప్రసాద్‌బాబు వాహనం ముందు టైరు తగిలి కిందపడిపోయాడు. ఆ తర్వాత క్రేన్ అతనిపై నుంచి తొక్కుకుంటూ వెళ్లడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న మీర్‌పేట్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యాని విశ్రాంత ఉద్యోగి దుర్మరణం
September 06, 2025
0
Tags