ప్రధాని నరేంద్ర మోడీ 75వ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖుల శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో రాష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. మాస్కో - న్యూఢిల్లీ మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రధాని మోడీ చేసిన వ్యక్తిగత సహకారాన్ని పుతిన్ ప్రత్యేకంగా ప్రశంసించారు. 'డియర్ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మీ 75వ పుట్టినరోజు సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలను స్వీకరించండి' అని పుతిన్ క్రెమ్లిన్ వెబ్‌సైట్‌లో పోస్టు పెట్టారు. భారత్, రష్యా మధ్య ప్రత్యేక విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించడం పట్ల మోడీ నిబద్ధతను ఆ పోస్టులో కొనియాడారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పుట్టినరోజు శుభాకాంక్షలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. మాస్కోతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి భారత్ నిబద్ధతను పునరుద్ఘాటించారు.'నా 75వ పుట్టినరోజు సందర్భంగా ఫోన్ కాల్ చేసి శుభాకాంక్షలు తెలిపినందుకు నా మిత్రుడు, అధ్యక్షుడు పుతిన్‌కు ధన్యవాదాలు. మా ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం. ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం భారత్ అన్ని విధాలుగా సహకారం అందించడానికి సిద్ధంగా ఉంది' అని మోడీ ట్వీట్ చేశారు.
మీ 75వ పుట్టినరోజు సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలను స్వీకరించండి !
September 17, 2025
0
Tags