మొహలి వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో 77 పంతుల్లోనే స్మృతి మంధానసెంచరీ చేసి చరిత్ర సృష్టించింది. టీమిండియా తరఫున రెండో అత్యంత వేగమైన సెంచరీని స్మృతి నమోదు చేసింది. టీమిండియా తరఫున అత్యధిక తక్కువ బంతులతో సెంచరీ చేసిన రికార్డు కూడా స్మృతిదే కావడం విశేషం. ఇదివరకు ఐర్లాండ్ పై రాజ్‌కోట్‌లో కేవలం 70 బంతుల్లో సెంచరీ సాధించి రికార్డు సాధించింది. తాజాగా సాధించిన సెంచరీ ఆమెకు వన్డేలలో 12వ సెంచరీ. దీనితో ఇంగ్లాండు ప్లేయర్ టామీ బ్యూమాంట్‌తో సమానంగా నిలిచింది. అలాగే ఓపెనర్ గా అత్యధిక సెంచరీలు సాధించిన స్మృతి, సుజీ బేట్స్‌తో కలిసి సమానంగా నిలిచింది.ఆస్ట్రేలియాపై వన్డేలలో అత్యధిక వేగవంతమైన సెంచరీ సాధించిన ప్లేయర్ గా స్మృతి మంధాన నిలిచింది. ఈ మ్యాచ్ లో భారత ఇన్నింగ్స్ లో 91 బంతుల్లో 117 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది స్మృతి మంధాన. మొత్తంగా టీమిండియా 49.5 ఓవర్లలో టీమిండియా 292 పరుగులకు ఆల్ అవుట్ అయింది.