ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన దంపతులు ఇద్దరూ ఉద్యోగస్తులు. దీంతో తమ 15 నెలల పాపను చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో రోజూ స్థానికంగా ఉన్న ఓ డే కేర్ సెంటర్‌లో వదిలి ఉద్యోగాలకు వెళ్లేవారు. ఇటీవల ఆ చిన్నారిని ఇంటికి తీసుకువచ్చాక దుస్తులు మారుస్తున్న క్రమంలో చిన్నారి శరీరంపై పలు చోట్ల గాయాలు, కొరికిన గుర్తులు ఉన్నట్లు గమనించారు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు డే కేర్ సెంటర్‌కు వెళ్లి వారిని నిలదీశారు. సిబ్బంది అక్కడి సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. అందులో అక్కడ ఆయాగా పని చేసే యువతి చిన్నారి ఎక్కువగా ఏడుస్తుండంతో అసహనానికి గురై ఏడుస్తున్నా పట్టించుకోకుండా కిందపడేసి, గోడకేసి, ప్లాస్టిక్ బ్యాట్‌తో కొడుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో తల్లిదండ్రులు వారిని నిలదీశారు, అయితే ఈ విషయం తెలిసినప్పటికీ యాజమాన్యం తమ తప్పును సరిదిద్దుకునే ప్రయత్న కూడా చేయలేదు. పైగా ప్రశ్నించినందుకు వారిపై దుర్భాషలాడారని ఆరోపిస్తూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వీడియోలో రికార్డైన దృశ్యాలను పోలీసుల ముందుంచారు. ఆ వీడియోల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు డే కేర్ సెంటర్‌లో పని చేసే యువతిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఈ ఘటనను సామాజిక మాధ్యమాలలో షేర్ చేయడంతో వీడియో వైరల్‌గా మారింది.
డే కేర్ సెంటర్‌లో చిన్నారి పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఆయా
August 11, 2025
0
Tags