బంగాళాఖాతంలో 13న అల్పపీడనం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఆరు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. బుధవారం నాటికి వాయువ్య బంగాళాఖాతం, దానికి అనుకుని వున్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది. గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దక్షిణకోస్తాంధ్ర మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించింది. బుధవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రభావంతో బుధ,గురువారల్లో దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.




Post a Comment

0Comments

Post a Comment (0)