సముద్రంలోకి వృథాగా పోయే జలాలపై రాజకీయ ప్రయోజనాల కోసం రాద్ధాంతం చేస్తున్నారు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానంపై సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని అన్నారు. రూ.84వేల కోట్లతో ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. నదుల అనుసంధానానికి పొరుగు రాష్ట్రాల సమ్మతి అవసరమని, చంద్రబాబు ఆ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సముద్రంలోకి వృథాగా పోయే జలాలపైనా రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం రూ.400 కోట్లు ఖర్చు చేయలేక హంద్రీనీవా ప్రాజెక్టును పక్కన పడేసిందని, కూటమి ప్రభుత్వం దాన్ని పూర్తి చేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం పనులు పూర్తవుతున్నాయి. సోమశిలకి 18,750 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రస్తుతం సోమశిల, కండలేరులో 150 టీఎంసీల నీటిని నిల్వ చేస్తాం. గత ప్రభుత్వం సోమశిల నుంచి కండలేరు ఫ్లడ్ ఛానల్ సామర్థ్యం 12 వేల క్యూసెక్కుల నుంచి 24 వేలకి పెంచుతామంది. మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి ఆలోచన లేకుండా కమీషన్ల కోసం టెండర్లు పిలిచారు. పనులు మధ్యలోనే ఆపేశారు. సోమశిల హైలెవల్ కెనాల్ కోసం అవసరమైన భూసేకరణకు సీఎం చంద్రబాబు నిధులిచ్చారు. జిల్లాలో 40 పంచాయతీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.12.8కోట్ల నిధులు ఇచ్చారు. గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి రూ.50కోట్లు కేటాయించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి జిల్లా ప్రజల తరుపున కృతజ్ఞతలని మంత్రి అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)