బెంగళూరులోతన చిన్ననాటి స్నేహితుడు భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్న అతను ప్రియురాలి మోజులో పడి స్నేహితుడిని దారుణంగా చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయ్ కుమార్, ధనంజయ్ ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. బెంగళూరులోని మాగడిలో 30 ఏళ్లు కలిసి పెరిగారు. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ లావాదేవీలు చేసే విజయ్ కు దాదాపు పదేళ్ల క్రితం ఆశాతో వివాహం జరిగింది. ఈ జంట కామాక్షిపాల్యలో నివాసం ఉంటున్నారు. విజయ్ భార్యకు ధనంజయ్ తో అక్రమ సంబంధం ఉంది. ఈ విషయం విజయ్ కి తెలియడంతో స్నేహన్ని, భార్యను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా కాపురాన్ని మాచోహళ్లికు మార్చాడు. అయినప్పటికీ భార్య తీరు మారలేదు. విజయ్ కు తెలియకుండా భర్త స్నేహితుడితో అక్రమ సంబంధాన్ని కొనసాగించింది. భర్త అడ్డు తొలిగించుకుంటే తప్ప ప్రియుడితో సుఖంగా ఉండలేనని భావించిన భార్య, భర్తను చంపేయాలని ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. సాయంత్రం ఇంటినుంచి బయలుదేరిన విజయ్ ను ధనుంజయ్ చంపేసి పారిపోయాడు. విజయ్ మృతదేహం మచ్చోహళ్లిలోని డిజి గ్రూప్ లేఅవుట్ ప్రాంతంలో దొరికింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆశా, ధనంజయ్ కలిసి విజయ్ హత్యకు కుట్ర పన్నారని విచారణలో తేల్చారు. పోలీసులు ఆశాను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడైన స్నేహితుడు ధనంజయ్ పరారీలో ఉన్నాడు.
చిన్ననాటి స్నేహితుడిని బలి తీసుకున్న అక్రమ సంబంధం
August 13, 2025
0
Tags