గూగుల్ పిక్సెల్ 8ఎ (128GB వేరియంట్) మార్కెట్లో ధర రూ. 52,999 వుంది. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం రూ. 15,000 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో ఈ ఫోన్ ధర రూ. 37,999కు తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌కు తోడు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లకు మరొక రూ. 7,000 తగ్గింపు. ఈ రెండు ఆఫర్లను కలిపితే, పిక్సెల్ 8ఎ ధర కేవలం రూ. 30,999కు లభిస్తుంది. కొనుగోలుదారుల సౌలభ్యం కోసం ఫ్లిప్‌కార్ట్, ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులపై ఆరు నెలల నోకాస్ట్ EMI సదుపాయం అందిస్తోంది. దీని ద్వారా కస్టమర్లు వడ్డీ లేకుండా సులభంగా చెల్లింపులు చేయవచ్చు.మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌చేంజ్ చేయడం ద్వారా, గరిష్టంగా రూ. 33,000 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. ఈ విలువ మీ పాత ఫోన్ బ్రాండ్, మోడల్, కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. పాత ఫోన్ మంచి కండిషన్‌లో ఉంటే, కొత్త పిక్సెల్ 8ఎను మరింత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.గూగుల్ పిక్సెల్ 8ఎ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్‌లో 6.1 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 120 హెచ్‌జడ్ రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. డిస్‌ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3ని ఉపయోగించారు. గూగుల్ సొంత టెన్సర్ జీ3 చిప్‌సెట్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్, 128, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి.గూగుల్ పిక్సెల్ ఫోన్లంటేనే కెమెరాలకు పెట్టింది పేరు. దీనికి తగ్గట్టుగానే, ఈ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. గూగుల్ ఏఐ ఫొటోగ్రఫీ టూల్స్ ద్వారా నాణ్యమైన చిత్రాలు తీయవచ్చు. 4,492ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఒక్కసారి చార్జ్ చేస్తే మూడు రోజుల వరకు వస్తుందని కంపెనీ పేర్కొంటోంది. మొత్తం మీద, మధ్య శ్రేణి బడ్జెట్‌లో మంచి కెమెరా, క్లీన్ యూజర్ ఇంటర్‌ఫేస్, ఏఐ ఫీచర్లతో కూడిన ఫోన్ కోసం చూస్తున్న వారికి పిక్సెల్ 8ఎ ప్రస్తుతం ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తోంది.
ఫ్లిప్‌కార్ట్ లో గూగుల్ పిక్సెల్ 8ఎపై డిస్కౌంట్ ఆఫర్ !
August 13, 2025
0
Tags