రాజస్థాన్‌లో దౌసా ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న పికప్ వ్యాన్ ఆగి ఉన్న కంటైనర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది చనిపోగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఏడుగురు పిల్లలు, ముగ్గురు మహిళలు ఉండడం తీవ్రవిషాదం నింపుతోంది. ఈ ప్రమాద బాధితులు ఉత్తరప్రదేశ్‌లోని ఎటా ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. వీరంతా ఖాతు శ్యామ్, సాలాసర్ బాలాజీ ఆలయాలను సందర్శించి తిరిగి వస్తుండగా మనోహర్‌పూర్ హైవేపై తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగిందని దౌసా పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారిని జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. అయితే వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. సంబంధిత ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఆగి ఉన్న కంటైనర్ ను ఢీకొట్టిన పికప్ వ్యాన్ : 11 మంది దుర్మరణం
August 13, 2025
0
Tags