కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 24 హత్యలు చేశారని మహేష్ శెట్టి తిమరోడి చేసిన ఆరోపణలు దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే మహేష్ శెట్టిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని హోంమంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ ఆదేశించారు. దీంతో పోలీసులు మహేష్ శెట్టిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పరువు నష్టం ఆరోపణలపై బీఎన్ఎస్ చట్టం కింద ఆయనపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. మహేష్ శెట్టి తిమరోడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. కొంతకాలంగా తిమరోడి ముఖ్యమంత్రులపై ఇలాంటి వివాదాస్పద ప్రకటన చేస్తున్నాడని, గతంలో కాంగ్రెస్ కీలక నేతలపై కూడా ఇలాంటి ఆరోపణలే చేశారని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మండిపడ్డారు.
సీఎం సిద్ధరామయ్యపై హత్యా ఆరోపణలు చేసిన మహేష్ శెట్టి తిమరోడిపై కేసు నమోదు !
August 18, 2025
0
Tags