దళితులు, ఆదివాసీల సంక్షేమం కోసం కృషి చేసిన పార్టీ కాంగ్రెస్‌ !

Telugu Lo Computer
0


ఢిల్లీలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ వార్షిక న్యాయ సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ దళితులు, ఆదివాసీల సంక్షేమం కోసం కృషి చేసిందని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్‌ అని, భాజపా, భారత రాష్ట్ర సమితి, జేడీ, బీజేడీ, ఆర్‌జేడీ.. ఏ పార్టీ అయినా స్వాతంత్ర్యం తర్వాతే వచ్చాయని తెలిపారు. ''ఇతర పార్టీలు ఎన్నికల్లో గెలిస్తే కుర్చీలో, ఓడితే ఇంట్లో కూర్చుంటాయి. ఎన్నికల్లో ఓడినా, గెలిచినా ప్రజల మధ్యే ఉన్న పార్టీ కాంగ్రెస్‌. మోడీ నేతృత్వంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. 11 ఏళ్లుగా సామాజిక న్యాయం కోసం ఆలోచించట్లేదు. వక్రమార్గంలో ఉన్న నేతలను రెండు చెంప దెబ్బలు కొట్టయినా దారిలోకి తెచ్చేందకు కాంగ్రెస్‌ కృషి చేస్తోంది. మా పార్టీ దేశానికి ఏం చేసిందని విమర్శిస్తున్నారు. 140 ఏళ్ల క్రితం దేశ ప్రజల స్వాతంత్ర్యం కోసం కదం తొక్కింది. ఆంగ్లేయులను ఓడించింది. భారత్‌ నుంచి ఉగ్రవాదులను పారద్రోలేందుకు ఇందిరాగాంధీ కృషి చేశారు. దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ అమరులయ్యారు. యూపీఏ-1 సమయంలో సోనియాగాంధీ ప్రధాని కావాలని అందరూ కోరారు. కానీ, ప్రధాని పదవిని ఆమె త్యాగం చేశారు. 2004లోనే రాహుల్‌గాంధీ కేంద్ర మంత్రి అయ్యేవారు. ఆయన కోరుకుంటే 2009లోనే ప్రధాని అయ్యేవారు. కానీ ప్రధాని, కేంద్ర మంత్రి పదవులు పార్టీ సీనియర్‌ నేతలకు ఇచ్చారు. కార్యకర్తగానే ప్రజల కోసం రాహుల్‌ గాంధీ పనిచేశారు. సామాజిక న్యాయం కోసం 25 ఏళ్లుగా పోరాడుతున్నారు. మరోవైపు నరేంద్ర మోడీ 25 ఏళ్లుగా కుర్చీ వదలట్లేదు. 2001లో సీఎం అయిననప్పటి నుంచి ఆయన కుర్చీలోనే ఉన్నారు. భాజపా సంఘ్‌ పరివార్‌ మోదీని తప్పించేందుకు ప్రయత్నించింది. కానీ అందుకు ఆయన రాజీ పడలేదు. 75 ఏళ్లు దాటిన వ్యక్తులు కుర్చీ వీడాలని మోహన్‌ భాగవత్‌ చెప్పారు. కానీ 75 ఏళ్లు దాటినా మోడీ అందుకు సిద్ధంగా లేదు. ఇదే నిబంధనతో అద్వానీ, మనోహర్‌ జోషిని తప్పించారు. మోడీని సీఎం పదవి నుంచి తప్పించేందుకు గతంలో వాజ్‌పేయీ, ప్రధాని పదవి నుంచి తప్పించేందుకు మోహన్‌ భాగవత్‌ ప్రయత్నించారు. ఆయన్ను తప్పించడం వారి వల్ల కాలేదు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మోడీకి వ్యతిరేకంగా రాహుల్‌ గాంధీ పోరాడతారు. భాజపాకు 150 సీట్లు దాటకుండా చూస్తాం'' అని రేవంత్‌రెడ్డి తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)