అమరావతిలో 13న బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రికి భూమిపూజ

Telugu Lo Computer
0


మరావతిలో ఈ నెల 13న బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమిపూజ చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను బాలకృష్ణ, ఆయన సన్నిహితులు గాంధీ, సిద్ధాంతి నాగమల్లేశ్వరరావు శనివారం పరిశీలించారు. ఆస్పత్రి నిర్మాణ ప్లాన్‌లను సీఆర్‌డీఏ అదనపు కమిషనర్ ప్రవీణ్ బాలకృష్ణకు వివరించారు. మొత్తం 21 ఎకరాల విస్తీర్ణంలో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మిస్తున్నట్లు చెప్పారు. మూడు దశల్లో ఆస్పత్రి నిర్మాణం ఉంటుందన్నారు. మహిళా సాధికారత ఆధారంగా తీసిన 'భగవంత్‌ కేసరి' సినిమాకు జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందని ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు.ఇకపై తాను తీయబోయే సినిమాలలో సమాజానికి సంబంధించిన మంచి సందేశాలు ఉంటాయని బాలకృష్ణ తెలిపారు. హిందూపురంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. భారీ ఎత్తున పరిశ్రమలు, అంతర్‌రాష్ట్ర రహదారుల నిర్మాణం చేపడుతున్నట్టు చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)