ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన నెల్లూరు నిడిగుంట అరుణ అరాచకాలపైచేశారు. ఆమె ప్రియుడు, రౌడీషీటర్ అవిలేలి శ్రీకాంత్ ఆగడాలపైనా వివరాలు సేకరిస్తున్నారు. ఓ బిల్డర్ ఫిర్యాదు మేరకు కోవూరు పోలీసులు ఆమెను బుధవారం అరెస్టు చేసి, ఒంగోలు జైలుకు తరలించిన విషయం తెలిసిందే. కోవూరు స్టేషన్‌లో నమోదైన కేసుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అరుణ చేసిన అరాచకాలపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఆమె ఫోన్‌లోని వాయిస్, వీడియో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. నెల్లూరులోని పోలీసు అతిథిగృహంలో అదనపు ఎస్పీ సీహెచ్ సౌజన్య గురువారం అరుణకు సంబంధించిన పలు విషయాలపై పలువురిని విచారించినట్లు తెలిసింది. అలాగే శ్రీకాంత్, అరుణలకు గత ప్రభుత్వంలో సహకరించిన పోలీసు అధికారులు, ఈ ప్రభుత్వంలో సహకరించిన అధికారులు, సిబ్బంది, ఏఆర్ సిబ్బంది ఎవరో జాబితా సిద్ధంచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది బయటకు పొక్కడంతో పోలీసు వర్గాల్లో గుబులు మొదలైంది. కాగా విజయవాడ నుంచి ఓ వ్యక్తి పోలీసు అధికారులకు ఫోన్ చేసి తన వద్ద అరుణ పెద్ద మొత్తంలో నగదు తీసుకుని మోసం చేసిందని, న్యాయం చేయాలని కోరారు. నెల్లూరుకు వచ్చి ఫిర్యాదు చేయాలని వారు సూచించారు. శుక్రవారం అతడు వస్తాడని తెలిసింది.
నిడిగుంట అరుణ అరాచకాలపై దర్యాప్తు ముమ్మరం
August 22, 2025
0
Tags