గగనతలంలో నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ డ్రోన్లను గుర్తించిన భారత్ భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఆదివారం రాత్రి సరిహద్దు అవతలి నుంచి ఆరు డ్రోన్లు ఎగురుతూ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఐదు నిమిషాల్లో అవి తిరిగి పాక్ భూభాగంలోకి వెళ్లాయన్నారు. నిఘా కోసం దాయాది దేశం వీటిని ప్రయోగించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. డ్రోన్లు ఆయుధాలు, మాదకద్రవ్యాలను జారవిడిచి ఉంటాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, డ్రోన్ల కదలికను గుర్తించిన అన్ని ప్రాంతాల్లో సోమవారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. గత కొన్నేళ్లుగా జమ్మూ కశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు పలు ఆయుధాలు, మాదకద్రవ్యాలను జారవిడుస్తుండడం పెద్ద సమస్యగా మారిందని అధికారులు పేర్కొన్నారు.
నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ డ్రోన్లు : అప్రమత్తమైన భద్రతా దళాలు
August 25, 2025
0
Tags