కేంద్రం తెచ్చిన బిల్లు కారణంగా 95 శాతం గ్రూప్ రెవెన్యూలు, 100 శాతం లాభాలు కోల్పోయిన డ్రీమ్ 11 విన్నూత్నంగా ఆలోచిస్తోంది. ఇతర మార్గాల్లో ఆదాయం తెచ్చుకునేందుకు అవకాశాల్ని అన్వేషిస్తోంది. అన్నింటికీ మించి తమ వద్ద ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఎవరినీ తొలగించేందుకు సిద్దంగా లేదు. ఈ విషయాన్ని మనీ కంట్రోల్ పోర్టల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా డ్రీమ్ 11 సంస్ధ సహ వ్యవస్ధాపకుడు, సీఈవో కూడా అయిన హర్ష్ జైన్ వెల్లడించారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్ధితుల నుంచి బయటపడేందుకు డ్రీమ్ 11 3.0కు వెళ్లబోతున్నట్లు హర్ష్ జైన్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రకటనలు, స్పాన్సర్ షిప్, అంతర్జాతీయంగా విస్తరణ, ఏఐ ఆవిష్కరణలపై దృష్టిసారిస్తున్నట్లు వెల్లడించారు. గత ఆర్ధిక సంవత్సరంలో డ్రీమ్ 11 6384 కోట్ల ఆదాయం సంపాదించింది. అంతకు ముందు ఆర్దిక సంవత్సరంలో ఆర్జించిన 3481 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. దీంతో తాజా సంక్షోభం నుంచి బయటపడేందుకు డ్రీమ్ స్పోర్ట్స్ ఫ్యాన్‌కోడ్, డ్రీమ్‌సెట్‌గో, డ్రీమ్ గేమ్ స్టూడియోస్ , ఫైనాన్స్-కేంద్రీకృత వెంచర్ డ్రీమ్ మనీతో సహా ఇతర వ్యాపారాలలో దాదాపు 500 మంది ఇంజనీర్లను తిరిగి నియమించాలని భావిస్తోంది. దీంతో ఇంత ఆదాయ సంక్షోభం ఎదుర్కొంటూ కూడా ఉన్న ఉద్యోగుల్ని తొలగించకుండా, గతంలో తీసేసిన ఉద్యోగుల్ని సైతం తిరిగి నియమించుకుని, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లేందుకు డ్రీమ్ 11 చేస్తున్న ప్రయత్నం ప్రశంసలు అందుకుంటోంది. డ్రీమ్ 11లో అన్ని విభాగాలు కలిపి 1900 నుంచి 2100 మంది ఉద్యోగులు ఉండొచ్చని అంచనా.
3.0కు వెళ్లనున్నట్లు డ్రీమ్11 సీఈవో హర్ష్ జైన్ ప్రకటన
August 26, 2025
0
Tags