ఓట్ల చోరీ అంటూ కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితం

Telugu Lo Computer
0


తెలంగాణలోని కరీంనగర్‌లో కేంద్రమంత్రి బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ  ఓట్ల చోరీ అంటూ కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని అన్నారు. 30 ఏళ్లుగా తాను ప్రజాప్రతినిధిగా ఉన్నానని, వార్డు మెంబర్‌ కానివాళ్లు కూడా విమర్శించడం సరికాదన్నారు. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ చేసిన ఆరోపణల నేపథ్యంలో బండి సంజయ్‌ స్పందించారు. ''దొంగ ఓట్లు అంటూ కాంగ్రెస్‌ నేతలు చేసే దుష్ప్రచారం ప్రజలను అవమానించడమే. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీలకు ఒక్క పైసా అయినా ఇచ్చిందా? కేంద్రం నిధులు ఇస్తుందనే ఇప్పుడు స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ నేతలు రాత్రిపూట యాత్రలు చేయడం ఏమిటో అర్థం కావడం లేదు. కరీంనగర్‌లో ప్రతి ఓటూ పరిశీలించి దొంగ ఓట్ల తీసేయాలి. రెండు చోట్ల ఓటు వేయడం ఎవరికైనా సాధ్యమా?అవగాహన లేకుండా ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఓట్ల చోరీ గురించి కాకుండా సీట్ల చోరీ గురించి మాట్లాడాలి. రొహింగ్యాల విషయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు. దేశం ముఖ్యమా? ఓటు బ్యాంకు ముఖ్యమా?అప్పుడు భారత రాష్ట్ర సమితి.. ఇప్పుడు కాంగ్రెస్‌.. రెండూ అదే తరహా రాజకీయాలు చేస్తున్నాయి'' అని బండి సంజయ్‌ విమర్శించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)