ఇండోర్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్‌ అయిన ఇండిగో విమానం

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌ దేవీ అహల్యాబాయ్‌ హోల్కర్‌ విమానాశ్రయం నుంచి రాయ్‌పూర్‌కు బయలుదేరిన ఇండిగో విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే తిరిగొచ్చి ల్యాండయ్యింది. మంగళవారం ఉదయం 6.30 గంటలకు విమానం ఇండోర్‌ నుంచి బయలుదేరింది. ఉదయం 6.54 గంటలకు విమానంలో సాంకేతిక లోపానికి సంకేతంగా అలారమ్‌ మోగింది. అప్పటికే విమానం సగానికిపైగా ప్రయాణం పూర్తి చేసుకుంది. అయినా పైలట్‌ ప్రయాణికుల సేఫ్టీ కోసం విమానాన్ని వెనక్కి మళ్లించాడు. తిరిగి ఇండోర్‌ విమానాశ్రయంలో సేఫ్‌గా ల్యాండ్ చేశాడు. అనంతరం ఇండిగో యాజమాన్యం ఫ్లైట్‌ను రద్దు చేసింది. ప్రయాణికుల టికెట్ చార్జీలను రీఫండ్‌ చేసింది. అనంతరం ఇండిగో ఇంజినీర్‌లు విమానాన్ని తనిఖీ చేయగా ఏ లోపం లేదని తేలింది. టెక్నికల్‌ ఇష్యూవల్ల ఫాల్స్‌ అలారమ్‌ మోగినట్లు ఇంజినీర్స్‌ నిర్ధారించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)