సీఎం రేవంత్‌రెడ్డికి మాట తప్పడంఅలవాటేనని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. చర్చ సిద్ధమంటూ ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్ ఇవాళ ఉదయం ప్రెస్‌క్లబ్ వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అరాచక పాలనలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అంటూ ప్రజలను మోసం చేశారు. బేసిన్ల నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ లేని సీఎం చర్చకు రావాలి. బహిరంగ చర్చకు రేవంత్‌రెడ్డి సవాలు విసిరితే మేం వచ్చాం. సవాలు విసిరిన సీఎం ఇక్కడకు ఎందుకు రాలేదు? సీఎం రాకపోతే మంత్రులైనా వస్తారని భావించాం. బహిరంగ చర్చకు రావాలని సీఎంకు మరోసారి చెబుతున్నాం. కొత్త తేదీ, ప్రదేశం రేవంత్‌రెడ్డి చెబితే మేం తప్పకుండా వస్తాం. అసెంబ్లీలో చర్చించేందుకు కూడా మేం సిద్ధంగా ఉన్నాం. మైకులు కట్ చేయకుండా.. పూర్తిగా మాట్లాడే అవకాశం ఇస్తే అసెంబ్లీలో కూడా చర్చకు సిద్ధం'' అని కేటీఆర్ అన్నారు.
ఆరు గ్యారంటీలు, 420 హామీలు అంటూ ప్రజలను మోసం చేశారు : కేటీఆర్
July 08, 2025
0
Tags