ఆసుపత్రిలో నర్సింగ్ ట్రైనింగ్ విద్యార్థిని గొంతు కోసి చంపిన యువకుడు

Telugu Lo Computer
0



ధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ జిల్లా ఆసుపత్రిలో 19 ఏళ్ల సంధ్య చౌదరి అనే విద్యార్థిని నర్సింగ్ ట్రైనింగ్ పొందుతోంది. ఎమర్జెన్సీ వార్డు దగ్గర ఉన్న సంధ్యపై అభిషేక్ కోష్టి అనే యువకుడు అమాంతంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. యువతి గొంతు కోస్తుంటే చుట్టూ జనం ఉన్న ఆపే ప్రయత్నం చేయలేదు సరికదా  కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయకుండా ప్రేక్షకుల్లా మొబైల్‌లో వీడియోలు తీశారు. నిందితుడు కూడా ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నట్లు నటించినా అనంతరం ఆస్పత్రి బయటకు వెళ్లి బైకుపై పరారయ్యాడు. సంధ్య-అభిషేక్ మధ్య స్నేహం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే కొంత కాలం నుంచి సంధ్య యువకుడికి దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో యువకుడు ఆమెపై పగ పెంచుకున్నాడు. జూన్ 27న ఘటన జరిగగా తాజాగా వీడియో వైరల్ అవుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. రెండేళ్ల నుంచి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేశామని కస్టడీలో అతడిని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)